భారతదేశంలో మెజారిటీ ప్రజలు గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. తెలియని ప్రాంతాలకు కేవలం అడ్రస్‌తో వెళ్లే వారికి ఇది ఒక గొప్ప మార్గదర్శి. గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు ఇందులో కొత్త ఫీచర్లను జోడిస్తోంది. గూగుల్ మ్యాప్స్‌లో మీకు తెలియని ఆ 7 అద్భుతమైన ఫీచర్లు ఇవే:
- దుకాణంలోని వస్తువులను చూడవచ్చు: మీరు ఏదైనా షాపుకు వెళ్లకముందే అక్కడ ఏయే వస్తువులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మ్యాప్స్‌లో సదరు షాపు ఐకాన్‌పై క్లిక్ చేస్తే, లోపలి ఫోటోలు, వస్తువుల జాబితా మరియు కస్టమర్ల రివ్యూలు కనిపిస్తాయి. దీనివల్ల మీకు కావాల్సిన వస్తువు అక్కడ ఉందో లేదో ఇంటి నుండే తెలుసుకోవచ్చు.
- భూమిని కొలవడానికి: మీరు ప్రతిరోజూ నడిచే దూరం లేదా ఒక నిర్దిష్ట స్థలం యొక్క వైశాల్యాన్ని కొలవడానికి గూగుల్ మ్యాప్స్ ఉపయోగపడుతుంది. యాప్‌లో ఏదైనా ఒక పాయింట్‌ను ‘లాంగ్ ప్రెస్’ చేసి, Measure distance ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత పాయింట్లను కదిలిస్తూ ఖచ్చితమైన దూరాన్ని లేదా విస్తీర్ణాన్ని లెక్కించవచ్చు.
- పెట్రోల్ బంక్ మరియు EV ఛార్జింగ్ స్టేషన్: ప్రయాణంలో పెట్రోల్ అయిపోతుందన్న భయం వద్దు. నావిగేషన్ ఆన్ చేసిన తర్వాత, సెర్చ్ ఐకాన్‌పై క్లిక్ చేసి Fuel stations లేదా EV charging stations అని టైప్ చేస్తే, మీ దారిలో ఉన్న బంకుల వివరాలను ఖచ్చితంగా చూపిస్తుంది.
- హోటల్ లేదా షాపు పూర్తి వివరాలు: మీరు కొత్త హోటల్‌కు వెళ్లేటప్పుడు అది తెరిచి ఉండే సమయం, పార్కింగ్ వసతి, దివ్యాంగుల కోసం ఉన్న సౌకర్యాలు మరియు పరిశుభ్రత వంటి వివరాలను ముందే తెలుసుకోవచ్చు. ఇతర కస్టమర్ల రేటింగ్స్ చూసి అది సరైన చోటో కాదో నిర్ణయించుకోవచ్చు.
- వీల్ ఛైర్ సౌకర్యం: దివ్యాంగులకు లేదా వీల్ ఛైర్ వాడే వారికి అనువైన ప్రదేశాలను గుర్తించడానికి మ్యాప్స్ సహాయపడుతుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి Accessibility ఆప్షన్‌లో Accessible Places ఆన్ చేయండి. దీనివల్ల వీల్ ఛైర్ వెళ్లడానికి వీలున్న ఎంట్రన్స్ ఉన్న ప్రదేశాలను మ్యాప్ ప్రత్యేకంగా చూపిస్తుంది.
- ట్రాఫిక్ జామ్ నుండి తప్పించుకోవడం: ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ పెద్ద సమస్య. మ్యాప్స్‌లో Traffic Layer ఆన్ చేస్తే, ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉందో (ఎరుపు రంగులో) లైవ్‌గా చూడవచ్చు. దీనివల్ల ట్రాఫిక్ లేని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు.
- AI ఫీచర్లు: గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్లు కూడా వచ్చాయి. ఉదాహరణకు, అకస్మాత్తుగా వర్షం పడితే.. మీకు సమీపంలో ఉన్న సురక్షితమైన కేఫ్‌లను ఇది సూచిస్తుంది. వాతావరణం మరియు రోడ్డు పరిస్థితిని బట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి AI సహాయపడుతుంది.
