గెలుపు పై వరుకూటి అశోక్ బాబు ధీమా వెనుక…

ఏపీలో కొన్నినియోజకవర్గాల్లో పోటీ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నుంచి వరుకూటి అశోక్ బాబు పోటీ చేస్తున్న వేమూరు ఫలితం పైన వైసీపీతో పాటుగా కూటమి నేతల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్దుల మార్పులో తొలి జాబితాలోనే వేమూరు నుంచి వరుకూటి అశోక్ బాబు పేరు ఖరారు చేసారు. అప్పటి నుంచి వరుకూటి అశోక్ బాబు ప్రణాళికా బద్దంగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు పైన ధీమాగా ఉన్నారు. తాజాగా జగన్ సైతం వరుకూటి అశోక్ బాబుకి కీలక దిశా నిర్దేశం చేసారు.

నియోజకవర్గంలో ప్రచారం
వరుకూటి అశోక్ బాబుని సీఎం జగన్ ఏరి కోరి వేమూరు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు.వరుకూటి అశోక్ బాబు నియోజకవర్గంలో తన మార్క్ ప్రచారంతో అందరికీ దగ్గరయ్యారు. అన్ని వర్గాలకు చెందిన వారికి దగ్గరయ్యారు. టీడీపీ ఓట్ బ్యాంక్ గా భావించే వారిని తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ రాజకీయం పైన అవగాహన ఉండటంతొ పాటుగా ఎన్నికలు చేసిన అనుభవం వరుకూటి అశోక్ బాబుకి కలిసొచ్చే అంశంగా మారింది.

వరుకూటి అశోక్ బాబు వ్యూహాత్మకంగా
నియోజకవర్గంలో గెలుపులో సామాజిక సమీకరణాలే కీలకంగా మారనున్నాయిజ దీంతో, ఒక వైపు ప్రచారం కొనసాగిస్తూనే..మరో వైపు అన్ని వర్గాల ముఖ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో గతంలో ఎవరూ పట్టించుకోని వర్గాలకు జరిగిన మేలు గురించి వివరిస్తూ..భవిష్యత్ లో వారికి దక్కే ప్రాధాన్యత గురించి హామీ ఇస్తున్నారు. జగన్ హాయంలో విద్య, ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యత..సంక్షేమం గురించి రజనీ ప్రత్యేకంగా ప్రతీ ఓటరుకు వివరిస్తున్నారు. వేమూరు లో వైసీపీకి 49% శాతం అనుకూలంగా ఉండగా.. టీడీపీకి 43%, ఇతరులు 8% ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీ తాజా మేనిఫెస్టో ద్వారా అనూహ్యంగా వేమూరు నియోజకవర్గంలో వైసీపీకి మద్దతు పెరిగినట్లు తాజా సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *