దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ఉన్న పార్కులో, తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన 17 ఏళ్ల బాలికకు జరిగిన ఘోరం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
దేవాలయానికి వెళ్లి వచ్చిన తర్వాత తన స్నేహితుడితో కలిసి పార్కులో కూర్చుని ఉండగా ఈ సంఘటన జరిగింది. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు, తాము పోలీసులమని అబద్ధం చెప్పి ఆ బాలికను, ఆమె స్నేహితుడిని బెదిరించారు. ఆ యువకుల ఫోన్లను లాక్కున్న ఆకతాయిలు, కేసు నమోదు చేస్తామని భయపెట్టి బాలికను పొదలు ఉన్న ప్రాంతానికి అపహరించి తీసుకెళ్లారు.
గొంతుపై కత్తిపెట్టి, తుపాకీ చూపించి బెదిరించిన ఆ వ్యక్తులు, బాలిక ఎంత వేడుకున్నా, ఏడుస్తున్నా పట్టించుకోకుండా వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు.
సంఘటన తర్వాత ఫోన్లను తిరిగి ఇచ్చేసి, బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి పంపించివేశారు. పార్కు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ బాలుడి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వేగంగా స్పందించి ప్రధాన నిందితుడైన ఆసిఫ్‌ను ఎన్‌కౌంటర్ (కాల్పుల) అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు హేమంత్, అతని సోదరుడిని కూడా పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు.

Leave a Reply