సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో, పాకిస్థాన్‌కు వెళ్లే నదీ జలాల పరిమాణాన్ని తగ్గించేలా జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలో ‘కిరు’ జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
చీనాబ్ నది ప్రవాహాన్ని మళ్లించి, సుమారు 624 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి.
భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో పాకిస్థాన్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి తలెత్తడంతో, ఆ దేశ ప్రభుత్వం, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురవుతున్నారు.
గతంలో భారత్ తమ దేశానికి నీటిని నిలిపివేస్తే యుద్ధం చేస్తామని, నదులను రక్తపుటేరులుగా మారుస్తామని పాకిస్థాన్ సైన్యం, అక్కడి పాలకులు నిరంతరం బెదిరింపులకు దిగేవారు. కానీ, వారి బెదిరింపులను ఏమాత్రం లెక్కచేయకుండా భారత్ ప్రాజెక్టు పనులను యథేచ్ఛగా కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నెటిజన్లు భారత్ నిర్మిస్తున్న కిరు డ్యామ్ నిర్మాణ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “భారత్ ఊపిరి తీస్తామని ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ సైనిక విదూషకులు ఇప్పుడు ఎక్కడికి పోయారు?” అంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను నేరుగా ఎగతాళి చేస్తున్నారు.
గత 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది.
పాకిస్థాన్ ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ వేదికల వద్దకు తీసుకెళ్లినప్పటికీ, ఉగ్రవాదానికి మద్దతివ్వడం ఆపే వరకు పాకిస్థాన్‌తో జలాల విషయమై ఎలాంటి చర్చలకు తావులేదని భారత్ తేల్చి చెప్పింది.
నదికి అడ్డంగా సొరంగాలు, డ్యామ్‌లు నిర్మించి భారత సరిహద్దుల్లోనే నీటిని మళ్లించేలా భారత్ అనుసరిస్తున్న ఈ వ్యూహం.. పాకిస్థాన్‌కు అతిపెద్ద ఆర్థిక, వ్యవసాయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది.

Leave a Reply