వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో ఒక సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. మృతి చెందిన 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని గర్భవతి అని తెలిసింది. ఆమె గర్భం దాల్చడంతో పరువు పోతుందనే భయంతో ప్రియుడు ఆమెకు గర్భనిరోధక/గర్భస్రావ మాత్రలు (Abortion/Contraceptive Pills) తినిపించినట్లు అనుమానిస్తున్నారు. ఆ మాత్రలు వికటించి (రియాక్షన్ అవ్వడం వల్ల) ప్రైవేట్ పార్ట్స్ నుండి విపరీతంగా రక్తస్రావం (Heavy Bleeding) జరిగి, ఆమె పీజీ హాస్టల్ మెట్లపైనే స్పృహతప్పి పడిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ప్రధాన నిందితుడైన ప్రియుడు సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సంతోషంగా రెండు లంచ్ బాక్సులతో వెళ్లిన విద్యార్థిని:
చందౌలీలోని బలువా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ 20 ఏళ్ల కుమార్తె, సారనాథ్ పోలీస్ క్వార్టర్స్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె స్థానిక కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న సమీర్ అనే యువకుడితో ఆమెకు ప్రేమ వ్యవహారం నడుస్తోంది. సమీర్ అక్కడ ఒక పేయింగ్ గెస్ట్ (PG) హాస్టల్లో ఉంటున్నాడు. కాలేజీకి వేసవి సెలవులు ప్రకటించడంతో సమీర్ తన సొంత ఊరికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. దీంతో అతడిని చివరిసారిగా కలవడానికి ఆ యువతి ఎంతో సంతోషంగా ఇంటి నుండి రెండు లంచ్ బాక్సులు సిద్ధం చేసుకుని ప్రియుడి రూమ్‌కు వెళ్లింది.
గదిలో మాత్రలు.. మెట్లపై రక్తపు మరకలు:
లంచ్ బాక్స్ తీసుకుని వెళ్లిన ఆ విద్యార్థిని దాదాపు రెండు గంటల పాటు ప్రియుడి గదిలోనే ఉంది. ఆ సమయంలోనే ప్రెగ్నెన్సీ విషయం బయటపడితే బద్నాం అవుతామనే భయంతో సమీర్ ఆమెకు అత్యంత పవర్ఫుల్ గర్భనిరోధక మాత్రను తినిపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ టాబ్లెట్ వేసుకున్న కొద్దిసేపటికే ఆమె శరీరంలో తీవ్రమైన రియాక్షన్ వచ్చి, విపరీతమైన రక్తస్రావం మొదలైంది. తట్టుకోలేని నొప్పితో తల్లడిల్లిపోతూ ఆమె గది నుండి బయటకు పరుగులు తీస్తూ పీజీ హాస్టల్ మెట్లపైనే స్పృహతప్పి పడిపోయింది. దీంతో బాయ్స్ హాస్టల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే ఆమెను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.
పోలీసుల అదుపులో ప్రియుడు:
మృతి చెందిన యువతి స్వయంగా ఒక పోలీసు అధికారి కుమార్తె కావడంతో ఈ ఘటన స్థానికంగా మరియు పోలీస్ శాఖలో తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి నిందితుడైన సమీర్‌ను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ కేసు వివరాలను సారనాథ్ ఏసీబీ (ACP) విదూష్ సక్సేనా అధికారికంగా వెల్లడిస్తూ.. “నర్సింగ్ విద్యార్థిని పీజీ హాస్టల్లో అపస్మారక స్థితిలో పడి ఉండగా ఆసుపత్రికి తరలించాం, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ప్రాథమిక విచారణలో ఆమె శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవు. మాత్రలు తినిపించడం వల్లే తీవ్ర రక్తస్రావమై మరణించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల ప్రత్యేక ప్యానెల్‌తో పోస్ట్‌మార్టం నిర్వహించాం, రిపోర్ట్ వస్తేనే మృతికి గల అసలు కారణాలు స్పష్టంగా తెలుస్తాయి” అని పేర్కొన్నారు.

Leave a Reply