ఘోరం..! “మైదానంలో రోలర్ కింద చిక్కుకున్న ఫుట్‌బాల్ స్టార్!”. షాక్‌లో అభిమానులు..!!

థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో, ఇంగ్లండ్ జట్టు మాజీ స్టార్ ఆటగాడు ఆండ్రోస్ టౌన్‌సెంట్ (Andros Townsend) పైకి పిచ్ రోలర్ దూసుకెళ్లిన విచిత్రమైన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది.

ఇంగ్లండ్‌కు చెందిన టోటెన్‌హామ్ హాట్స్‌పుర్ (Tottenham Hotspur) జట్టు మాజీ వింగర్ అయిన ఇతను, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని ‘పి.టి. ప్రాచువాప్’ (PT Prachuap) జట్టు తరపున ఆడుతున్నాడు.

‘థాయ్ లీగ్ వన్’ మ్యాచ్ విరామ సమయంలో, టౌన్‌సెంట్ తన సహచర ఆటగాళ్లతో కలిసి మైదానంలో వార్మప్ (Warm-up) చేస్తున్నాడు. అప్పుడు బంతిని గాలిలో ‘బ్యాక్‌హీల్ షాట్’ కొట్టడానికి ప్రయత్నిస్తుండగా, పొరపాటున మైదాన నిర్వాహకుడు నడుపుతున్న భారీ పిచ్ రోలర్ వెళ్లే మార్గంలోకి వచ్చేశాడు.

అదుపు తప్పిన ఆ పిచ్ రోలర్ టౌన్‌సెంట్ కాళ్లను ఢీకొట్టి అతడిని నేలపైకి పడేసి, అతడి పైకి ఎక్కింది. అదృష్టవశాత్తూ ఆ భారీ యంత్రం అతని నడుము భాగం వద్ద ఆగిపోవడంతో, తృటిలో పెను ప్రమాదం నుండి, తీవ్ర గాయాల నుండి అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

రోలర్ కింద నుండి అతడిని బయటకు తీయడం చూసి సహచర ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. అయినప్పటికీ, ఇంగ్లండ్ జాతీయ జట్టు తరపున 13 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న టౌన్‌సెంట్, ఎలాంటి గాయాలు లేకుండా కోలుకుని.. మ్యాచ్ అదనపు సమయంలో (Extra time) సబ్‌స్టిట్యూట్ (ప్రత్యామ్నాయ) ఆటగాడిగా బరిలోకి దిగి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో పి.టి. ప్రాచువాప్ జట్టు 3-0 గోల్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *