అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చంద్రుడు అమెరికాకే సొంతమని ప్రకటించడంతో పాటు, స్పేస్ ఫోర్స్ సిబ్బందికి కొత్త యూనిఫాంలను ప్రవేశపెట్టి తీవ్ర చర్చనీయాంశంగా మారారు.
దాని కొనసాగింపుగా, తాజాగా అమెరికా శ్వేతసౌధం (వైట్‌హౌస్) అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ట్రంప్‌ను డీసీ కామిక్స్ సూపర్ హీరో ‘గ్రీన్ లాంతర్న్’ పాత్రలో చూపించే ఒక ఏఐ (AI) వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో, పచ్చటి కాంతిని వెదజల్లే ఉంగరం శక్తులను ఉపయోగించి, ఎడారి ప్రాంతంలో అక్రమ వలసలను అడ్డుకునేలా ట్రంప్ సరిహద్దు గోడను నిర్మిస్తున్నట్లు చూపించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో 1 కోటికి పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారింది. “అమెరికా ప్రభుత్వ అధికారిక పేజీని కాస్తా పూర్తిస్థాయి మీమ్స్ పేజీగా మార్చేశారు!”, “ప్రజల పన్ను డబ్బుతో ఇలాంటి ఏఐ వేషాలు వేస్తున్నారా?” అంటూ నెటిజన్లు ట్రంప్‌ను, వైట్‌హౌస్ యంత్రాంగాన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply