“చేతిలో తుపాకీ ఉంటే ఎంత గంభీరంగా ఉంటుంది కదా!” – బురఖా ధరించిన ఒక యువతి నిశ్శబ్దంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్పై వచ్చిన ఒక వ్యక్తి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
మరుక్షణమే ఎవరూ ఊహించని విధంగా, ఆ యువతి తన బ్యాగ్ నుండి తుపాకీని తీసి అతడిపై గురిపెట్టింది. ఒక్కసారిగా భయపడిపోయిన ఆ బైకర్, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బైక్ వేసుకుని అక్కడి నుండి పరారయ్యాడు.
సోషల్ మీడియాలో చూసేవారికి వెన్నులో వణుకు పుట్టించే ఈ వీడియో, ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది మహిళా భద్రతపై కొత్త చర్చకు కూడా దారితీసింది. అయితే, ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజాన్ని పరిశీలిస్తే, ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు; పూర్తిగా ఏఐ (AI – Artificial Intelligence) సాంకేతికతతో సృష్టించబడిన ఒక నకిలీ వీడియో. నిశితంగా గమనిస్తే ఇది ఏఐ రూపొందించిన వీడియో అని స్పష్టంగా తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ, “ఇది ఏఐ వీడియోనే కావచ్చు, కానీ నిజ జీవితంలో కూడా మహిళలకు ఆత్మరక్షణ కోసం లైసెన్స్డ్ తుపాకులు అందుబాటులో ఉంటే, ఇలాంటి కామాంధులకు తగిన బుద్ధి చెప్పవచ్చు” అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
