చైనాలో మూడో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలుడు, ప్రతిరోజూ పాఠశాల నుంచి ఇచ్చే హోమ్వర్క్లు చేయలేక అలసిపోయి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
ఒకానొక దశలో విసుగు చెందిన ఆ చిన్నారి, తన తల్లిపై గట్టిగా కేకలు వేస్తూ నిరసనకు దిగాడు. “రేపు ఇంత కష్టపడి చదివినా, చివరకు ఏ ధనవంతుడి కిందో కూలీ పని చేసుకునే ఉద్యోగిగానే మారతాను కదా? దీనికోసం ప్రతిరోజూ నేనెందుకు ఇంత నరకం అనుభవించాలి?” అంటూ తన తల్లిని నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
దానికి తల్లి స్పందిస్తూ.. “బాగా చదివితేనే మంచి ఉద్యోగం వస్తుంది” అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ తల్లి మాటలను ఏమాత్రం ఒప్పుకోని ఆ బాలుడు.. “నువ్వు చెప్పేదంతా భ్రమల ప్రపంచం, నిజ జీవితంలో అలా ఉండదు” అని నిర్మొహమాటంగా బదులిచ్చి వాదనను ముగించాడు. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే సమాజంలోని కార్పొరేట్ ఉద్యోగ సంస్కృతిని, విద్యా విధానాన్ని వేలెత్తి చూపిన ఆ బాలుడి మాటలు ప్రస్తుతం అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపిస్తూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply