“చదువు 10వ తరగతే!”.. భారత సైన్యానికే పేలుడు పదార్థాలను సరఫరా చేసే వ్యక్తి.. రైల్వే స్టేషన్ నుండి ₹46,000 కోట్ల సామ్రాజ్యం వరకు.. వైరల్ అవుతున్న మాస్ హిస్టరీ..!!!

కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే మనిషి ఏ ఎత్తుకైనా ఎదగగలడు అనడానికి సత్యనారాయణ నువాల్ ఒక గొప్ప ఉదాహరణ. రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన, ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేశారు.

కష్టాల నుండి మొదలైన ప్రయాణం: 19 ఏళ్లకే వివాహం కావడంతో కుటుంబ బాధ్యతలు పెరిగాయి. బతుకుదెరువు కోసం ఇల్లు వదిలి బయటకు వచ్చిన ఆయన వద్ద కనీసం ఉండటానికి గది అద్దెకు తీసుకునేంత డబ్బు కూడా లేదు. దీనితో ఆయన అనేక రాత్రులు రైల్వే స్టేషన్లలోనే నిద్రపోయారు. పెన్ను సిరా (Ink) తయారు చేయడం, రవాణా వ్యాపారం వంటి చిన్న చిన్న పనులు చేసినా మొదట్లో ఆయనకు ఓటమి మాత్రమే ఎదురైంది.

మలుపు తిప్పిన పరిచయం: మహారాష్ట్రలో అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తిని కలవడం నువాల్ జీవితంలో అతిపెద్ద మలుపు. ఆయన వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి గిడ్డంగిని (Explosives Warehouse) అద్దెకు తీసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించిన నువాల్, బొగ్గు గనులకు పేలుడు పదార్థాలను సరఫరా చేయడం మొదలుపెట్టారు.

సోలార్ ఇండస్ట్రీస్ స్థాపన: 1995లో ఆయన తన సొంత సంస్థ ‘సోలార్ ఇండస్ట్రీస్’ (Solar Industries) ను స్థాపించారు. నేడు భారత సైన్యానికి మందుగుండు సామగ్రిని తయారు చేసే లైసెన్స్ పొందిన మొదటి ప్రైవేట్ సంస్థ ఇదే కావడం విశేషం.

నేటి ప్రస్థానం: 73 ఏళ్ల వయసున్న ఆయన ప్రస్తుత ఆస్తి విలువ ₹46,500 కోట్ల పైమాటే. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో పడుకున్న ఒక సామాన్యుడు, నేడు తన వ్యాపారాన్ని 65 దేశాలకు విస్తరించి ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థాయికి ఎదిగారు.



Posted

in

by

Tags: