ఫ్లోరిడాకు చెందిన 29 ఏళ్ల నర్సు కిర్స్టీ రాబర్ట్స్, గత నాలుగేళ్లలో తన కళ్ల ముందే ఎంతో మంది ప్రాణాలు విడవటం చూశారు. మరణానికి కొన్ని నిమిషాల ముందు ప్రతి ఒక్కరూ ఒక రకమైన “ఆధ్యాత్మిక మార్పును” అనుభవిస్తారని ఆమె చెబుతున్నారు. దీనిని వైద్య శాస్త్రం కూడా వివరించలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఒక సోషల్ మీడియా వీడియోలో, రోగులు తమ చివరి క్షణాల్లో తరచుగా చెప్పే మాటలను ఆమె పంచుకున్నారు.
మరణాన్ని ముందుగానే గుర్తిస్తారు
కిర్స్టీ చెప్పిన దాని ప్రకారం, ఆసుపత్రిలో చేరిన రోగి పరిస్థితి ఎలా ఉన్నా, వైద్యులు ప్రమాదం లేదని చెప్పినా.. రోగులు మాత్రం తమ మరణం దగ్గర పడిందని ముందుగానే గ్రహిస్తారు. చనిపోయే ముందు వారు ఎక్కువగా ఈ మాటలు అంటుంటారు:
- “నేను వారిని ప్రేమిస్తున్నానని నా కుటుంబ సభ్యులకు చెప్పండి.”
- “నేను త్వరలోనే చనిపోతాను.”
- “నేను చనిపోతున్నానని నాకు తెలుసు.”
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మాటలు చెప్పిన కొద్ది నిమిషాల్లోనే వారు తుది శ్వాస విడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వైద్యం కూడా ఓడిపోతుందని కిర్స్టీ పేర్కొన్నారు.
వైద్య నిపుణుల మద్దతు
కేవలం కిర్స్టీ మాత్రమే కాదు, ఇతర వైద్య నిపుణులు కూడా ఈ అనుభవాన్ని ధృవీకరిస్తున్నారు.
- ఒక మాజీ నర్సు స్పందిస్తూ, “ఆమె చెప్పింది పూర్తిగా నిజం, రోగులు ఎల్లప్పుడూ తమ మరణం గురించి తెలుసుకుంటారు” అని వ్యాఖ్యానించారు.
- మరో వ్యక్తి తన మామగారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన మరణాన్ని ఖచ్చితంగా అంచనా వేసినట్లు తెలిపారు.
