చమురుకు బదులు భారత్‌కు రష్యా ఏం అమ్ముతోంది? ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు!

రష్యా చమురు విషయంలో భారత్‌ను ఒత్తిడికి గురిచేస్తున్న అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. భారత్ ఇప్పుడు రష్యా నుండి ఆంక్షల (Sanctions) ప్రభావం లేని వస్తువును కొనుగోలు చేస్తోంది. అదే బంగారం. ఇది అమెరికా డాలర్ పునాదులను కదిలిస్తోంది.

గత ఏడాది మొదటి 10 నెలల్లో భారత్ రష్యా నుండి సుమారు 5 కోట్ల డాలర్ల (దాదాపు ₹415 కోట్ల నుండి ₹458 కోట్ల వరకు) విలువైన బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ విదేశాల్లో ఉన్న తన బంగారాన్ని వెనక్కి రప్పించడమే కాకుండా, అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించే ‘యుఎస్ ట్రెజరీ బాండ్ల’ను (US Treasury Bonds) విక్రయించి, ఆ స్థానంలో రికార్డు స్థాయిలో బంగారాన్ని నిల్వ చేస్తోంది.

డాలర్‌పై తగ్గుతున్న నమ్మకం: 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్ల నిధులను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేశాయి (Freeze). ఇది చూసిన భారత్, చైనా వంటి దేశాలు.. అమెరికా తన డాలర్‌ను ఒక ఆయుధంగా వాడుతోందని గ్రహించాయి. అందుకే 30 ఏళ్లలో మొదటిసారిగా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ట్రెజరీ బాండ్ల కంటే గోల్డ్ రిజర్వ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల వద్ద 4.5 ట్రిలియన్ డాలర్ల బంగారు నిల్వలు ఉండగా, ట్రెజరీ బాండ్లు 3.5 ట్రిలియన్లకు పడిపోయాయి.


Posted

in

by

Tags: