“చాలురా బాబూ! 15 రోజులు కూడా ముంబైలో ఉండలేకపోయాను..!” 24 గంటలూ అదే రణగొణ ధ్వని.. దుబాయ్‌లో ప్రశాంతత.. ముంబైలో నరకం.. యువతి చెప్పిన షాకింగ్ నిజం.. వైరల్ అవుతున్న వీడియో..!!

దుబాయ్, ముంబై.. ఈ రెండు నగరాలూ ఉరుకుల పరుగుల జీవనశైలికి, ఎత్తైన భవనాలకు పేరొందినవే అయినప్పటికీ, అక్కడి జీవన విధానంలో మాత్రం చాలా పెద్ద తేడా ఉందని ఫరా అనే యువతి పేర్కొన్నారు.

దుబాయ్‌లో నివసిస్తున్న ఫరా, 15 రోజుల పాటు ముంబైలో గడిపి తిరిగి దుబాయ్ వెళ్లిన తర్వాత, తన సోషల్ మీడియా పేజీలో పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఆమె మాట్లాడుతూ.. “దుబాయ్‌లో వాహనాలు వెళ్తున్నప్పుడు ప్రజలు ప్రశాంతంగా వేచి ఉంటారు. కానీ ముంబైలో మాత్రం సిగ్నల్ వద్ద ఆగినప్పుడు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకునే స్థాయిలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది” అని తెలిపారు.

అంతేకాకుండా, దుబాయ్‌లో ప్రశాంతమైన జీవితం ఉంటుందని, కానీ ముంబై వీధుల్లో మాత్రం 24 గంటలూ వాహనాల హారన్ మోతలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయని ఆమె పోల్చి చెప్పారు.

ముంబైలో జీవన వ్యయం (బతికే ఖర్చు) మధ్యతరగతి ప్రజల చేయి దాటిపోయిందని, ఒక్కసారి బయటకు వెళ్తే కనీసం రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఖర్చయిపోతోందని, అక్కడ జీవించడం చాలా కష్టంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *