చీరాలలో కూటమికి వ్యతిరేకత – వైఎస్సార్సీపీదే హవా

సముద్ర తీరానికి పక్కనే ఉండే చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో ఉద్ధండులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కరణం బలరాం గెలిచాడు. ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా MM కొండయ్య బరిలో నిలిచారు. వైసీపీ తరపున ఈసారి కరణం వెంకటేష్ తొలిసారి పోటీచేస్తున్నారు.

వైసీపీ పాలనలో చీరాల పరిధిలో ఐదేళ్లు అభివృద్ధి దూసుకెళ్లింది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రజలు సంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చీరాల అసెంబ్లీ వాసులు వైసిపికి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు.

అత్యధికంగా బీసీ ఓటర్లు ఉండటం ఈ స్థానం ప్రత్యేకత. ఆ తర్వాత అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీలు, కమ్మ, కాపు సామాజిక వర్గీయులు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. సంస్థాగతంగా వైపిసి బలంగా ఉండటం, ఆమంచి కాంగ్రెస్ నుండి పోటీ చేయడం కూడా వైసిపి విజయం సునాయాసమన్న సానుకూలత వ్యక్తమవుతోంది. కరణం వెంకటేష్ నియోజకవర్గంలో రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఈ సారి మాత్రం వైసీపీ గెలుపు ఖాయమనే ప్రచారం క్షేత్ర స్థాయిలో జరుగుతోంది. చీరాల పైన సానుకూల నివేదికలు వస్తున్నాయని.. ఎక్కడా అతి విశ్వాసం లేకుండా.. భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అధిష్టానం వెంకటేష్ కి సూచించారు. దీంతో..వెంకటేష్ తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *