చేనులో పనిచేస్తున్న వదినను కరిచిన పాము.! మరది చేసిన పని వేరే లెవల్!. వదినను కరిచిన పామును వెతికి పట్టుకొని.. డబ్బాలో బంధించిన మరది!. అంతటితో ఆగకుండా.. ఆ పామును కూడా తీసుకొని వదినను ఆసుపత్రికి తీసుకెళ్లాడు.!!!

రాజస్థాన్‌లోని డిగ్ ప్రాంతంలో చేనులో పనిచేస్తున్న ఒక మహిళను పాము కరిచిన ఘటన కలకలం రేపింది.

సజ్జ చేనులో పనిచేస్తున్న సమయంలో, అక్కడ దాగి ఉన్న పాము హఠాత్తుగా ఆ మహిళను కరిచినట్లు సమాచారం. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె నొప్పితో తీవ్రంగా కేకలు వేసింది. అక్కడున్నవారు వెంటనే ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కాగా, కరిచిన పాము ఏదో గుర్తిస్తే చికిత్స అందించడం సులువవుతుందని భావించారు.

దీంతో ఆ మహిళ మరది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడున్న పామును చాలా జాగ్రత్తగా పట్టుకుని, ఒక డబ్బాలో బంధించాడు. అనంతరం ఆ పామును కూడా తనతో పాటు తీసుకొని, పాము కాటుకు గురైన వదినను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులకు ఘటన గురించి చెప్పి, ఆ డబ్బాలోని పామును కూడా చూపించాడు. ఇది ఆ మహిళకు ఎలాంటి చికిత్స అందించాలో నిర్ణయించడంలో వైద్యులకు ఎంతో సాయపడిందని తెలుస్తోంది.

పాము కరవగానే కంగారుపడి సమయాన్ని వృథా చేయకుండా, మహిళను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా, పామును కూడా గురుతుపట్టేలా సురక్షితంగా తీసుకెళ్లిన ఘటన ఆ ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా పాము కరిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తుంటారు. అలాంటిది పామును డబ్బాలో బంధించి ఆసుపత్రికి తెచ్చిన దృశ్యం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ప్రస్తుతం వైరల్‌గా మారింది. వదిన పాము కాటుకు గురైన వేళ, భయపడకుండా పామును పట్టుకుని డబ్బాలో వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన మర్ది ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. అయితే, పామును నేరుగా పట్టుకోవడం చాలా ప్రమాదకరమని, ప్రజలు ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాము కరిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి తగిన చికిత్స పొందాలి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *