చేపల వేట పడవలా? యుద్ధ నౌకలా? నడిసముద్రంలో 2,000 నౌకలను దింపిన చైనా; 3వ ప్రపంచ యుద్ధం ఇక్కడి నుంచే మొదలవుతుందా? వణుకుతున్న ఆసియా..!!

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, చైనా ఇప్పుడు ఆసియా ప్రాంతంలో కొత్త అలజడిని సృష్టించింది.

నాసా (NASA) విడుదల చేసిన శాటిలైట్ ఫోటోల ప్రకారం, తూర్పు చైనా సముద్రంలో చైనా ఒకేసారి సుమారు 2,000 చేపల వేట నౌకలను రంగంలోకి దింపినట్లు వెల్లడైంది. దాదాపు 400 కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్న ఈ నౌకల ద్వారా, ఆ సముద్ర మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించే ప్రయత్నంలో చైనా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది జపాన్, ఫిలిప్పీన్స్ మరియు తైవాన్ దేశాలకు వెళ్లే సముద్ర మార్గాలను అడ్డుకోవడానికి చైనా వేస్తున్న ఒక వ్యూహాత్మక ‘యుద్ధ విన్యాసం’గా విశ్లేషకులు భావిస్తున్నారు.

నేరుగా యుద్ధ నౌకలను వాడకుండా చేపల వేట పడవలను వాడటం వెనుక ఒక లోతైన కారణం ఉంది. యుద్ధ సమయాల్లో శత్రు దేశాల సముద్ర రవాణాను రహస్యంగా, సులభంగా అడ్డుకోవడానికి ఇటువంటి నౌకలు ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తాయి. తాము ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నామని ప్రపంచ దేశాలకు హెచ్చరిక పంపడానికి చైనా ఈ ఎత్తుగడను వేస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఇంధన కొరతతో ఇబ్బంది పడుతుంటే, చైనా యొక్క ఈ చర్య ఆసియాలో మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమోనన్న భయాన్ని పెంచుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *