చైనా నుండి 9 లక్షల ‘స్పెషల్ వెపన్స్’ తెప్పించిన ఇరాన్.. కన్ఫ్యూజన్‌లో అమెరికా వాయుసేన! లక్షల విలువైన మిసైల్స్‌తో బుడగలను కొడుతున్నారా?

ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి ప్రధాన స్రవంతి మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అనేక ఆసక్తికరమైన వార్తలు షేర్ అవుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ఒక Mi-17 హెలికాప్టర్‌పై దాడి చేసిన వీడియోను షేర్ చేసింది. అయితే, అది నిజమైన హెలికాప్టర్ కాదని, కేవలం నేలపై గీసిన పెయింటింగ్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే తరుణంలో ఇరాన్ తన శత్రువులను బురిడీ కొట్టించడానికి మరో కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

ఆయుధాలు కావు.. అవి గాలి బుడగలు! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఇరాన్, చైనా నుండి సుమారు 9 లక్షల ‘నకిలీ ఆయుధాలను’ దిగుమతి చేసుకుంది. వీటిలో ట్యాంకులు, మిసైల్ క్యారియర్లు, బాలిస్టిక్ మిసైళ్ల వంటి నకిలీ నమూనాలు (Decoys) ఉన్నాయి. వీటిని గాలితో నింపినప్పుడు దూరం నుండి చూస్తే అసలైన యుద్ధ ట్యాంకుల్లాగే కనిపిస్తాయి. ఆకాశంలో ఎగిరే ఫైటర్ జెట్లు వీటిని అసలైన లక్ష్యాలుగా భ్రమపడి, దాదాపు 40 లక్షల డాలర్ల విలువైన ఖరీదైన మిసైళ్లతో వీటిని పేల్చేస్తున్నాయి. తీరా చూస్తే అవి కేవలం 500 డాలర్ల విలువ చేసే రబ్బరు బుడగలు మాత్రమే!

శత్రువును తప్పుదోవ పట్టించే వ్యూహం: చైనా ఇటువంటి ‘బొమ్మలను’ తయారు చేయడంలో సిద్ధహస్తురాలు. ఇరాన్ వీటిని యుద్ధంలో సమర్థవంతంగా వాడుకుంటోంది. అమెరికా వైమానిక దళం ఇప్పటివరకు చేసిన వేలాది దాడుల్లో ఎన్ని అసలైన లక్ష్యాలను తాకాయి? ఎన్ని నకిలీ బొమ్మలపై బాంబులు వేశాయి? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఒక నెటిజన్ ఎగతాళి చేస్తూ.. “లక్షల డాలర్ల బాంబులను కేవలం గాలి బుడగలపై వేయడం అమెరికాకే చెల్లింది” అని రాశారు.

అయితే, ఈ వార్త సోషల్ మీడియా పోస్ట్‌ల ఆధారంగా ఇచ్చిందే తప్ప, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.


Posted

in

by

Tags: