“చొక్కాలు చించి.. చెయ్యి విరగ్గొట్టి..!” పశువుల కొట్టంలో ప్రభుత్వ పాఠశాలా..? పరిశీలనకు వెళ్లిన సీజేపీ బృందంపై దాడి.. బీజేపీపై ఆరోపణలు.. షాకింగ్ వీడియో..!!!

రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు, కార్యకర్తలు వెళ్లారు.

గత కొన్నేళ్లుగా పశువుల కొట్టంలో కొనసాగుతున్న ఈ పాఠశాల దుస్థితిని పరిశీలించాల్సిందిగా గ్రామస్థులే తమను కోరారని చెబుతూ, సీజేపీ సహ వ్యవస్థాపకుడు అశుతోష్ రంగా నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లింది.

అయితే, గ్రామంలోకి ప్రవేశించిన సీజేపీ బృందాన్ని ఓ గుంపు అడ్డుకుని, అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగింది. ఆ కార్యకర్తలను “నక్సలైట్లు”, “దేశద్రోహులు”, “పాకిస్థానీయులు” అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి తరిమికొట్టింది. ఈ దాడిలో సీజేపీ నాయకుల వాహనాలు, మొబైల్ ఫోన్లు ధ్వంసమయ్యాయి. ఒక మహిళతో సహా పలువురు తీవ్రంగా గాయపడగా, ఒకరికి చేయి విరిగింది.

ఈ దాడికి బీజేపీ గూండాలే కారణమని సీజేపీ ఆరోపించింది. తాము వస్తున్న సమాచారాన్ని పోలీసులకు ముందే తెలిపినప్పటికీ, స్థానిక బీజేపీ నేత బయటి వ్యక్తులను రప్పించి పక్కా ప్లాన్‌తో దాడి చేయించారని అశుతోష్ రంగా పేర్కొన్నారు. అదే సమయంలో, గ్రామస్థులమని చెప్పుకున్న కొందరు వ్యక్తులు.. సీజేపీ కార్యకర్తలు దేశద్రోహులని, వారు తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని మీడియాకు తెలిపారు.

ఈ ఘటన రాజస్థాన్ అసెంబ్లీలోనూ తీవ్ర దుమారం రేపింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. ఈ హింసకు బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా డిమాండ్ చేశారు.

దీనికి బదులిచ్చిన రాజస్థాన్ హోంశాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బేడం.. సీజేపీ పేరుతో కాంగ్రెస్ పార్టీయే వెనకుండి ఈ సమస్యలను సృష్టిస్తోందని ఎదురుదాడికి దిగారు. దీంతో శాసనసభలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, గందరగోళం నెలకొంది.


Posted

in

by

Tags: