ఛీఛీ.! డబ్బు కోసం ఇట్లా కూడా చేస్తారా.? “సొంత కూతురినే రూ.1.5 లక్షలకు అమ్మేసి.” కిడ్నాప్ నాటకమాడిన తల్లి. మహిళా బ్రోకర్‌తో సహా 4 గురు గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్. షాకింగ్ నేపథ్యం.!!

ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ, తన డబ్బు అవసరం కోసం 15 ఏళ్ల కూతురిని రూ.1.5 లక్షలకు ఒక ముఠాకు విక్రయించింది.

అయితే, మాట్లాడుకున్న మొత్తంలో రూ.80,000 మాత్రమే చేతికి రావడంతో, ఆగ్రహించిన తల్లి తన కూతురు కిడ్నాప్‌కు గురైందని చెబుతూ పోలీస్ స్టేషన్‌లో నాటకమాడి తప్పుడు ఫిర్యాదు చేసింది. పోలీసులు తీవ్రంగా విచారణ జరిపి, ఉత్తరప్రదేశ్‌లో దాచి ఉంచిన చిన్నారిని సురక్షితంగా రక్షించారు.

అక్కడ జరిపిన విచారణలో, పింకీ మాలిక్ అనే మహిళ ద్వారా చిన్నారిని కన్న తల్లి నుండి కొనుగోలు చేసిన లవి కుమార్ అనే వ్యక్తి, పెళ్లి ఆశ చూపి మనీష్ అనే వ్యక్తికి రూ.2 లక్షలకు ఆ చిన్నారిని మళ్లీ అమ్మేసినట్లు వెలుగు చూసింది. తల్లిని పోలీసులు గట్టిగా విచారించడంతో, డబ్బు కోసం కూతురిని అమ్మేసినట్లు, మిగిలిన డబ్బు రాకపోవడంతోనే తప్పుడు ఫిర్యాదు చేసినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో చిన్నారి తల్లితో సహా ఈ అక్రమ చర్యకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.


Posted

in

by

Tags: