ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మహిళా సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) అను రాణికి సంబంధించిన వివాదాస్పద, అత్యంత ప్రైవేట్ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో లీకై తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వేగంగా స్పందించి ఆమెను విధుల్లోంచి సస్పెండ్ చేశారు.
పోలీస్ శాఖకు చెందిన సోషల్ మీడియా నిబంధనలను, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఉన్నతాధికారులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనపై మీరట్ క్రైమ్ ఎస్పీ అవనీష్ కుమార్ మాట్లాడుతూ.. “మహిళా ఎస్సై అశ్లీల వీడియో వైరల్ కావడం పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధం. అందుకే ఆమెను వెంటనే సస్పెండ్ చేశాం. ఈ వీడియో ఎక్కడి నుంచి లీక్ అయింది? దీని అసలు వాస్తవాలేంటి? అనే అంశాలపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోంది. సీవో సౌమ్యా సింగ్ నేతృత్వంలో శాఖాపరమైన విచారణ జరుగుతోంది, నివేదిక అందిన వెంటనే తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయి” అని వెల్లడించారు.
