రోడ్డుపై నడిచి వెళ్లే పాదచారులను, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులను ఒంటిపై బట్టలు లేకుండా వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేస్తున్న షాకింగ్ వీడియో ‘X’ (ట్విట్టర్) వేదికగా విడుదలై తీవ్ర కలకలం రేపింది.
మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిలా కనిపిస్తున్న సదరు దుండగుడు.. ఆ మార్గంలో వెళ్తున్న వారిపై దారుణంగా దాడులకు తెగబడుతున్నాడు.
కాపాడబోయిన యువకుడిపై కూడా దాడి:
అక్కడ దాడికి గురవుతున్న వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన మరో యువకుడిపై కూడా ఆ వ్యక్తి అత్యంత క్రూరంగా దాడి చేశాడు.
కుటుంబ కలహాలు లేదా తీవ్రమైన పేదరికం కారణంగా మానసిక సమతుల్యత కోల్పోయినట్లు భావిస్తున్న ఈ వ్యక్తి వల్ల సమాజానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించడమో లేదా మానసిక చికిత్సా కేంద్రంలో (Mental Asylum) చేర్పించడమో చేయాలని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
