“ఛీ.. వీడసలు మనిషేనా.?” దొంగతనానికి వెళ్లిన చోట జంట హత్యలు చేసి, మృతదేహంపై అఘాయిత్యానికి పాల్పడిన కిరాతకుడు.. అటవీ ప్రాంతంలో నక్కిన నిందితుడిని కాల్చి పట్టుకున్న పోలీసులు.. ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ (Kannauj) జిల్లాలో జరిగిన దారుణమైన జంట హత్యల కేసులో ప్రమేయం ఉన్న నిందితుడిని పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు.

దొంగతనానికి వెళ్లిన చోట భార్యాభర్తలిద్దరినీ హత్య చేయడమే కాకుండా, ఆ మహిళ మృతదేహంపై ఆ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గత నవంబర్ 4వ తేదీ రాత్రి, గుర్సహాయ్‌గంజ్ (Gursahaiganj) ప్రాంతంలో ఉన్న సంజీవ్ అనే వ్యక్తి ఇంట్లోకి యోగేష్ రాజ్‌పుత్ అనే వ్యక్తి దొంగతనం చేసే ఉద్దేశంతో చొరబడ్డాడు. అప్పుడు చప్పుడు విని సంజీవ్, అతని భార్య మేల్కోవడంతో, దొరికిపోతామన్న భయంతో యోగేష్ వారిద్దరినీ కర్రతో కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు.

ఈ దారుణం తర్వాత, మృతి చెందిన ఆ మహిళ మృతదేహంపై యోగేష్ లైంగిక అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, అక్కడున్న పసికందును సైతం విసిరేయడంతో ఆ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి ఆ దుండగుడు పరారయ్యాడు.

ఈ భయానక ఘటనపై ప్రత్యేక బృందాన్ని (స్పెషల్ టాస్క్ ఫోర్స్) ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితుడు యోగేష్ రాజ్‌పుత్‌ను గుర్తించారు. ఆ తర్వాత, ఆదివారం కసారీ (Kasari) అటవీ ప్రాంతంలో తలదాచుకున్న అతడిని పోలీసులు చుట్టుముట్టారు.

ఆ సమయంలో పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన యోగేష్‌పై పోలీసులు జరిపిన కాల్పుల్లో, అతని రెండు కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. గాయపడిన స్థితిలో అరెస్టు చేసిన అతడిని ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు, తదుపరి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *