ఐరోపాలోని 67 క్లినిక్‌లకు పంపిణీ చేయబడిన ఒక వీర్యదానం ద్వారా, క్యాన్సర్‌ను కలిగించే అరుదైన జన్యు మార్పు (Genetical Mutation) కలిగిన దాతకు కనీసం 197 మంది పిల్లలు జన్మించినట్లు ఒక పెద్ద అధ్యయనంలో వెల్లడైంది.
ఈ పిల్లల్లో కొందరు ఇప్పటికే క్యాన్సర్‌తో బాధపడుతున్నారు, మరికొందరు చిన్న వయసులోనే మరణించడం దిగ్భ్రాంతిని కలిగించింది.
డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌ను ప్రధాన కేంద్రంగా కలిగిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ (ESB) ద్వారా ఈ దానం పంపిణీ చేయబడింది.
ఈ జన్యు మార్పును లీ-ఫ్రౌమెని సిండ్రోమ్ అని అంటారు. ఇది ఒక వ్యక్తికి జీవితకాలంలో వివిధ రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని 90% వరకు పెంచే అవకాశం ఉంది. ఈ దాత 2005వ సంవత్సరంలో విద్యార్థిగా ఉన్నప్పుడు వీర్యదానం చేయడం ప్రారంభించాడు.
ఇతని వీర్యంలో టీపీ53 (TP53) జన్యువులో ఏర్పడిన మార్పు కారణంగా, ఇతని ద్వారా గర్భం ధరించిన పిల్లలలో గరిష్టంగా 20% మందికి ఈ ప్రమాదకరమైన జన్యు మార్పు సంక్రమించే అవకాశం ఉంది.
ఈ దాత ద్వారా 75 కుటుంబాలకు మించి పిల్లలు జన్మించకూడదనే ESB పరిమితిని దాటి, 197 మంది పిల్లలు జన్మించడం అనేది, వీర్యదానాలను అంతర్జాతీయ స్థాయిలో నియంత్రించాల్సిన మరియు పర్యవేక్షించాల్సిన అవసరాన్ని తెలియజేసింది.
