జపాన్లో జన్మించి, తన బాల్యాన్ని నేపాల్లో గడిపిన అదితి పౌడెల్ అనే 17 ఏళ్ల విద్యార్థిని, జపాన్ తొలి అక్షరాస్యత రాయబారిగా (లిటరసీ అంబాసిడర్గా) నియమితులై అరుదైన ఘనత సాధించారు.
చిన్నతనం నుంచే పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడంలో అమితాసక్తి చూపిన అదితి.. బడికి వెళ్లకముందే తన తాతయ్య ఇచ్చిన సంక్లిష్టమైన దేవనాగరి లిపిలోని దినపత్రికలను సైతం సునాయాసంగా చదివి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుతం టోక్యోలో ఉన్నత పాఠశాల చివరి సంవత్సరం చదువుతున్న ఆమె.. పఠనాసక్తిని పెంపొందించడంలో, యువతలో అభ్యాస తృష్ణను వ్యాప్తి చేయడంలో కనబరిచిన అంకితభావానికి గుర్తింపుగా జపాన్ తొలి అక్షరాస్యత రాయబారిగా గౌరవం పొందారు. ఆమె సాధించిన ఈ విశేష ఘనతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Leave a Reply