బ్రెజిల్ దేశంలోని ఒలిండా నగరంలో ఉన్న ఒక వ్యాయామశాలలో (Gym) శిక్షణ పొందుతున్న రొనాల్డ్ మాంటినెగ్రో (55) అనే వ్యక్తి, బార్బెల్ (Barbell) అతని ఛాతీపై పడటంతో దారుణంగా మరణించాడు.
55 సంవత్సరాల వయస్సు గల ఆ వ్యక్తి వ్యాయామం చేస్తుండగా, అకస్మాత్తుగా అతని చేతుల నుండి బార్బెల్ జారిపోయి ఛాతీపై పడిన భయంకరమైన దృశ్యాలు భద్రతా కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
బార్బెల్ పడిన తర్వాత లేచి ఛాతీని తడుముకున్న అతను, కొద్ది క్షణాల్లోనే నేలపై స్పృహ తప్పి పడిపోయాడు. దగ్గరలో ఉన్నవారు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక మరణించాడు.
ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన రొనాల్డ్, బ్రెజిల్‌లోని ప్రసిద్ధ పాలసియో డోస్ బోనెకోస్ జిగాంటెస్ మ్యూజియం (Palácio dos Bonecos Gigantes Museum) డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఆయన మరణం పట్ల మ్యూజియం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
