దీపావళి పండుగను పురస్కరించుకుని రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లకు 5 నెలల ఉచిత సేవలు, ఇతర ప్రయోజనాలను అందించే మాస్ ‘ఫ్రీడమ్ ఆఫర్’ను ప్రకటించింది.
జియో అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ ‘జియో హోమ్’ (Jio Home) సేవల కింద వర్తిస్తుంది. జియో ఫైబర్ (Jio Fiber) మరియు జియో ఎయిర్‌ఫైబర్ (Jio AirFiber) ప్లాన్లను వినియోగించే కస్టమర్లు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఈ ఆఫర్ ప్రకారం, కస్టమర్లు 10 నెలలకు సరిపడా రీఛార్జ్ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే, ఏకంగా 15 నెలల పాటు జియో హోమ్ సేవలను నిరంతరాయంగా పొందవచ్చు. దీని ద్వారా ఎలాంటి అదనపు రుసుము లేకుండా 5 నెలల పాటు సేవలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.
నెలకు రూ.666 చొప్పున 10 నెలల పాటు రీఛార్జ్ చేయడం ద్వారా అన్లిమిటెడ్ వై-ఫై, లైవ్ టీవీ మరియు పలు ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ల సబ్స్క్రిప్షన్లను ఉచితంగా పొంది ఆనందించవచ్చు.
ప్రస్తుతం జియో హోమ్ సేవలను వినియోగిస్తున్న కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేయడంతో జియో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply