తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా ఉన్న సూర్య–జ్యోతిక తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి చేసుకున్నట్లు కనిపించే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
పెళ్లై ఎన్నో సంవత్సరాలు గడిచినా.. తమ మధ్య ప్రేమ, ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదన్నట్లుగా ఈ ఫొటోల్లో సూర్య–జ్యోతిక జంటగా కనిపించారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు వారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ అందమైన ఫొటోల కింద ప్రముఖ టీవీ యాంకర్ డీడీ తన సరదా శైలిలో కామెంట్ చేశారు.
“అంతా బాగానే ఉంది.. కానీ ‘యూ మే కిస్ ది బ్రైడ్’ అనే సమయంలో తీసుకున్న ఆ కిస్ ఫొటో ఎక్కడ?” అంటూ జ్యోతికను సరదాగా అడిగారు.
డీడీ కామెంట్‌కు నటి జ్యోతిక ఊహించని విధంగా స్పందించారు. సిగ్గుపడుతున్న ఎమోజీలతో పాటు..
“ఆ ఫొటో మా దగ్గర చాలా జాగ్రత్తగా, ప్రత్యేకంగా ఉంది.. కానీ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయలేం!” అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు.
జ్యోతిక ఇచ్చిన ఈ క్యూట్ రిప్లై ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఈ సరదా సంభాషణపై స్పందిస్తూ..
“ఇన్ని సంవత్సరాలు గడిచినా.. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, సిగ్గు ఏమాత్రం తగ్గలేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినీ అభిమానులు ఆదర్శ జంటగా భావించే సూర్య–జ్యోతికకు సంబంధించిన ఈ స్వీట్ మూమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Leave a Reply