అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ టారిఫ్‌ను 15 శాతానికి పెంచారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి వచ్చే దిగుమతులపై గతంలో ప్రకటించిన 10% సుంకాన్ని ఇప్పుడు 15% చేస్తున్నట్లు శనివారం ఆయన వెల్లడించారు.
ఈ చర్య పూర్తిగా చట్టబద్ధమైనదని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచ వాణిజ్యం మరియు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం: అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద అన్ని దిగుమతులపై టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు 6-3 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ తీర్పును అధిగమించేందుకే ట్రంప్ ఇప్పుడు సుంకాన్ని మరింత పెంచినట్లు కనిపిస్తోంది.
