టిడిపి కు అంత సులువు కాదా? కరణం వెంకటేష్ మామూలుగా పోటీ ఇవ్వడం లేదటగా?

చీరాల నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంది.. చీరాలలో మారుతున్న సమీకరణాలు వైసిపికి లాభం చేకూరుస్తాయి. చీరాలలో వైకాపా తరుపున కరణం వెంకటేష్ బరిలో ఉండగా, కూటమి నుంచి కొండయ్య పోటీ చేస్తున్నారు. కొండయ్య చీరాల ఎంచుకుని ఆయన తప్పు చేశారా? అన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. సేఫ్ ప్లేస్ లు వదిలేసి కొండయ్య చీరాల ఎంచుకుని తప్పు చేశారా? అన్న అంతర్మధనం పార్టీలో సాగుతుంది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ను ఆషామాషీగా తీసేయలేని పరిస్థితి. కరణం కుటుంబం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేత. ఆయన తండ్రి బలరాం కూడా అందరికీ అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటారు. కరణం వెంకటేష్ ఇంట్లోకి పిఠాపురం ఓటర్లు ఎవరైనా నేరుగా వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా ప్రభావం చూపనున్నాయి.

అయితే యువ ఓటర్లు కొంత మంది టిడిపికి మద్దతుగా ఉన్నారు. కానీ మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి ఓటర్లు మాత్రం కరణం వెంకటేష్ వైపు ఉన్నట్లే కనిపిస్తుంది. కాపు సామాజికవర్గం ఓట్లు 30 వేలకు పైగానే ఉన్నారు. ఆమంచి అదే సామాజికవర్గం కావడంతో ఓట్లు చీల్చుకునే అవకాశాలున్నాయి. బీసీ ఓటర్లు 80 వేలకు పైగానే ఉన్నారు. బీసీలు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది. అందులోనూ మహిళలు వైసిపి వైపు నిలిస్తే టిడిపి గెలుపు అంత సులువు కాదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కరణం ఫ్యామిలీ పిఠాపురానికి గతంలో అభివృద్ధి చేసిన విషయాన్ని కూడా ఓటర్లు విస్మరించడం లేదు. పైగా అందుబాటులో ఉండే నేత కావడంతో వెంకటేష్ వైపు మొగ్గు చూపే అవకాశముంది.

అయితే చీరాలనియోజకవర్గంలో టిడిపి గెలుపు అంత సులువుగా లేదన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో ఓటమి పాలయితే పార్టీని నడపటం అటుంచి.. నాయకుడిగా తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని కొండయ్య భావిస్తున్నారు. అందుకే ఆయన అన్ని రకాలుగా గెలుపు కోసం శ్రమిస్తున్నారు. చీరాలలో గెలుపు అంత సులువు కాదన్న నివేదికలు టిడిపి వర్గాలను దడ పుట్టిస్తున్నాయి. చీరాల నియోజకవర్గం ఓటర్ల తీర్పు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఈసారి ఎవరిది గెలుపు అన్న దానిపై ఇప్పటి నుంచే పెద్దయెత్తున బెట్టింగ్ లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *