ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ ప్రాంతంలో ఉన్న బిట్టెర్న్ పార్క్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) టీచర్‌గా పనిచేస్తున్న బ్రాన్వెన్ జేమ్స్ (30) అనే మహిళా ఉపాధ్యాయురాలిపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆమె 2022లో తన పాఠశాలలో చదువుతున్న 16 ఏళ్ల మైనర్ బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ కేసుకు సంబంధించి బాధితుడైన విద్యార్థి న్యాయస్థానంలో సమర్పించిన వీడియో వాంగ్మూలంలో దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించాడు. టీచర్ జేమ్స్ తనతో స్నాప్‌చాట్ (Snapchat) ద్వారా చాట్ చేస్తూ దగ్గరైందని, ఆ తర్వాత కారులో ముద్దుపెట్టుకుని, తన ఇంటికి తీసుకెళ్లి శారీరకంగా కలిసినట్లు తెలిపాడు. అంతేకాకుండా, “ఆమె నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పింది, అప్పట్లో అదంతా నాకు ఓ టీనేజ్ కలలా అనిపించింది” అని బాలుడు పేర్కొన్నాడు.
అయితే, ఈ ఆరోపణలన్నింటినీ సదరు ఉపాధ్యాయురాలు బ్రాన్వెన్ జేమ్స్ పూర్తిగా కొట్టిపారేశారు. “స్నేహితుల దగ్గర గొప్పలు చెప్పుకోవడానికే ఆ విద్యార్థి నాపై ఈ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాడు” అని ఆమె కోర్టులో వాదించారు. మొత్తం 4 ప్రధాన నేరారోపణల కింద నమోదైన ఈ కేసుపై న్యాయస్థానంలో తీవ్రస్థాయిలో విచారణ కొనసాగుతోంది.
