“టీవీలో లైవ్ ప్రసారం అవుతుండగానే..!” పార్లమెంట్‌లో ఎంపీలు చేసిన పని! ఘర్షణగా మారిన వాగ్వాదం.. దిగ్భ్రాంతికి గురిచేస్తున్న షాకింగ్ వైరల్ వీడియో…!!

ఆర్మేనియా దేశ పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగి, అకస్మాత్తుగా ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకున్న దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది.

స్కూల్, కాలేజీ విద్యార్థులు రోడ్డు మీదకొచ్చి కొట్టుకున్నట్లుగా.. ప్రజాప్రతినిధులు ఏకంగా పార్లమెంటులోనే ఒకరినొకరు నెట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలై తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.

చట్టసభలు, పార్లమెంటు సమావేశాల్లో చర్చలు పక్కదారి పట్టి ఎంపీలు ఇలా భౌతిక దాడులకు దిగడం లాంటి ఘటనలు ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని రగిల్చాయి.

దేశంలోని కీలక సమస్యలపై చర్చించి పరిష్కారాలు కనుగొనాల్సిన అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులే ఇలా వీధి రౌడీల్లా హింసకు పాల్పడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు హుందాతనంతో ప్రవర్తించాలని, సభ పవిత్రతను మంటగలిపిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.


Posted

in

by

Tags: