టీసీఎస్ నాసిక్ మతమార్పిడి ఉచ్చు: మాస్టర్‌మైండ్ నిదా ఖాన్ కొత్త డ్రామా! అరెస్ట్ తప్పించుకోవడానికి ‘ప్రెగ్నెన్సీ’ అస్త్రం?

ముంబై/నాసిక్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ యూనిట్‌లో సంచలనం సృష్టించిన మతమార్పిడి ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దారుణానికి సూత్రధారిగా భావిస్తున్న నిదా ఖాన్, కటకటాల వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది. ప్రస్తుతం తాను గర్భవతినని, అందుకే తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించింది.

హెచ్.ఆర్ కాదు.. కేవలం టెలీ కాలర్ మాత్రమే!

తొలుత నిదా ఖాన్ కంపెనీలో హెచ్.ఆర్ (HR) విభాగంలో పనిచేస్తోందని ప్రచారం జరిగినప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. ఆమె కేవలం ఒక టెలీ కాలర్ మాత్రమేనని, సేల్స్ టీమ్‌లో భాగంగా పనిచేసేదని వారు స్పష్టం చేశారు. 2021లో బీపీఓలో చేరిన నిదా, గతేడాది వివాహం చేసుకుని ముంబైకి మకాం మార్చినట్లు సమాచారం.

మతమార్పిడి కుట్రలో ‘బిగ్ బాస్’:

ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. బాధితులను ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేయడమే కాకుండా, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తన గర్భాన్ని సాకుగా చూపి స్థానిక కోర్టులో ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, ప్రాసిక్యూషన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈమె గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తూ యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్రకు పాల్పడిందని అధికారులు వాదిస్తున్నారు.

అసలేం జరిగింది?

నాసిక్ టీసీఎస్ బీపీఓలో పనిచేస్తున్న 23 ఏళ్ల యువతి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో సీనియర్ ఉద్యోగి డానిష్ షేక్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ తర్వాత మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు వాపోయింది.

బాధితురాలి సంచలన ఆరోపణలు:

  • నిందితులు ఒక ముఠాగా ఏర్పడి 18 నుండి 25 ఏళ్ల లోపు యువతులను టార్గెట్ చేసేవారు.
  • ఇస్లాం మతం గొప్పదని ప్రచారం చేస్తూ, హిందూ దేవుళ్లను అవమానించేవారు.
  • నిదా ఖాన్ మరియు తౌసీఫ్ అనే వ్యక్తులు నేరుగా బాధితులను వేధించేవారు.
ఎనిమిది మందిపై కేసు.. ఏడుగురు అరెస్ట్!

ఈ కేసులో ఇప్పటివరకు నాసిక్ పోలీసులు ఎనిమిది మందిపై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడైన డానిష్ షేక్‌తో పాటు తౌసీఫ్ అత్తర్, రజా మెమన్, షారూఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అన్సారీ, షారూఖ్ షేక్ మరియు మరో మహిళను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిదా ఖాన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

కార్పొరేట్ రంగంలో ఇంతటి భారీ మతమార్పిడి కుట్ర వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.


Posted

in

by

Tags: