టీ కప్పులో అసలైన రుచి రావడం లేదా? అదిరిపోయే టీ తయారు చేయడానికి కొన్ని చిట్కాలు ఇవే!

టీ మనందరి జీవితంలో ఒక భాగం. కానీ చాలా ఇళ్లలో ఇప్పటికీ టీని సరైన పద్ధతిలో తయారు చేయడం లేదు. ఉదయాన్నే అయినా, ఆఫీసు విరామంలో అయినా లేదా సాయంత్రం అలసట పోగొట్టుకోవడానికైనా ఒక కప్పు టీ ఉంటే చాలు. మంచి టీ తాగితే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుందని చాలా మంది అంటారు. టీ చేయడం సులభం అనిపించినా, కొలతలు సరిగ్గా లేకపోతే రుచి మారిపోతుంది.

మంచి రుచికరమైన టీ కోసం కొన్ని చిట్కాలు:

1. నీటి కొలత ముఖ్యం: టీ తయారీలో జరిగే మొదటి తప్పు నీటి కొలతలోనే ఉంటుంది. మీకు ఎన్ని కప్పుల టీ కావాలో, అన్ని కప్పుల నీటిని తీసుకోండి. ఉదాహరణకు, రెండు కప్పుల టీ కోసం రెండు కప్పుల నీరు పోయండి. నీటిని కనీసం 4 నిమిషాల పాటు బాగా మరిగించాలి. దీనివల్ల నీటిలోని పచ్చి వాసన పోయి రుచి పెరుగుతుంది.

2. అల్లం మరియు మసాలాలు: మీకు అల్లం టీ లేదా మసాలా టీ ఇష్టమైతే, నీళ్లు మరుగుతున్నప్పుడే వాటిని వేయండి. చల్లని నీటిలో అల్లం వేయకూడదు. నీరు మరిగేటప్పుడు అల్లం, మసాలాలు వేస్తే వాటి ఫ్లేవర్ టీకి బాగా పడుతుంది.

3. టీ పొడి వేసే విధానం: నీరు బాగా మరిగిన తర్వాతే టీ పొడి వేయాలి. పొడి వేసిన వెంటనే పాలు పోయడం తప్పు. టీ పొడి వేసాక కనీసం 5 నిమిషాల పాటు ఆ నీటిలో మరిగించాలి. అప్పుడే టీకి మంచి రంగు, రుచి వస్తాయి.

4. చక్కెర ఎప్పుడు వేయాలి? టీ పొడి మరిగిన తర్వాత మాత్రమే చక్కెర వేయండి. పాలు పోసిన తర్వాత చక్కెర వేస్తే టీ రుచి తగ్గుతుంది మరియు టీ పల్చగా అయ్యే అవకాశం ఉంది.

5. పాలు పోసేటప్పుడు జాగ్రత్త: నీరు మరిగి సగానికి తగ్గినప్పుడు ఒక కప్పు పాలు కలపండి. పాలు చల్లగా ఉండకూడదని గుర్తుంచుకోండి. చల్లని పాలు పోస్తే టీ వేడి ఒక్కసారిగా తగ్గి రుచి దెబ్బతింటుంది. పాలు పోసిన తర్వాత మంట తగ్గించి టీని బాగా మరిగించాలి.

గుర్తుంచుకోవాల్సిన అంశం: టీ తయారైందని చెప్పడానికి గుర్తు ఏమిటంటే.. టీ మరిగేటప్పుడు పెద్ద పెద్ద బుడగలు రావడం మరియు రంగు చిక్కగా మారడం. అప్పుడు మీ ‘పర్ఫెక్ట్ టీ’ సిద్ధమైనట్లు అర్థం.


Posted

in

by

Tags: