టీ పేరు ఎత్తితేనే తాగాలనే కోరిక కలుగుతుంది. కానీ చాలా మంది టీ చేసేటప్పుడు చేసే పెద్ద తప్పు ఏంటంటే.. నీళ్లు మరగకముందే అన్నింటినీ కలిపేయడం. దీనివల్ల టీకి అసలైన రుచి రాదు.
పర్ఫెక్ట్ టీ కోసం సరైన పద్ధతి ఇదీ: ప్రతి ఒక్కరూ టీ చేస్తారు, కానీ కొందరి చేతి టీ మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఏ పదార్థం ఎప్పుడు వేయాలో తెలుసు.
- నీటిని మరగనివ్వండి: ముందుగా గిన్నెలో నీళ్లు తీసుకోండి. 2 కప్పుల టీ కోసం ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి బాగా మరగనివ్వండి.
- టీ పౌడర్ వేయడం: నీళ్లు మరిగిన తర్వాతే 2 చెంచాల టీ పౌడర్ వేయాలి. అలాగే తురిమిన అల్లం కూడా వేసి బాగా మరిగించాలి.
- పాలు ఎప్పుడు పోయాలి?: ఒకటిన్నర కప్పు నీళ్లు మరిగి ఒక కప్పు అయ్యేంత వరకు మరిగించి, ఆ తర్వాతే పాలు పోయాలి. పాలు పోశాక మంట పెద్దది చేసి రెండు సార్లు పొంగు రానివ్వాలి.
- చక్కెర చివరలో: పాలు మరిగిన తర్వాతే చక్కెర వేసి మరో 2-3 సార్లు మరిగిస్తే టీ రంగు, రుచి రెండూ అద్భుతంగా ఉంటాయి.
మనం చేసే తప్పులు:
- చాలా మంది నీళ్లు మరగకముందే టీ పౌడర్, చక్కెర కలిపేస్తారు. దీనివల్ల టీ రంగు సరిగ్గా రాదు.
- కొందరైతే పాలు, నీళ్లు, టీ పౌడర్, చక్కెర.. అన్నీ కలిపి ఒకేసారి పొయ్యి మీద పెడతారు. ఇది సరైన పద్ధతి కాదు.
- ప్రతి పదార్థం ఉడకడానికి కొంత సమయం పడుతుంది. అన్నీ కలిపి వేయడం వల్ల కొన్నిసార్లు అల్లం వేయగానే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల పదార్థాలు, మీ శ్రమ రెండూ వృథా అవుతాయి.
