అమెరికాలో ట్రంప్ పరిపాలన మరియు అక్కడి మీడియా సంస్థల మధ్య మరోసారి తీవ్ర విభేదాలు తలెత్తాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడే అత్యంత సురక్షితమైన ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం భద్రతకు సంబంధించి ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన రిపోర్టులే ఈ వివాదానికి కారణం.
ఏం జరిగింది?
కతర్ బహుమతిగా ఇచ్చిన కొత్త బోయింగ్ విమానాన్ని గత వారమే అధ్యక్షుడు ట్రంప్ తన అధికారిక పర్యటనల కోసం వినియోగించడం ప్రారంభించారు. అయితే, ఈ విమానం భద్రతలో లోపాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ రెండు సంచలనాత్మక కథనాలను ప్రచురించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ప్రభుత్వం, ఆ వార్తలు రాసిన జర్నలిస్టులకు కోర్టు సమన్లు జారీ చేసింది.
మీడియా చేసిన ఆరోపణలు:
సీక్రెట్ సర్వీస్ హెచ్చరిక: ఇరాన్‌తో ఉద్రిక్తతల దృష్ట్యా, ఈ కొత్త విమానాన్ని వాడొద్దని అమెరికా సీక్రెట్ సర్వీస్ ట్రంప్‌ను కోరిందని కథనం పేర్కొంది.
సాంకేతిక లోపాలు: పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల్లో ఉన్న ఆధునిక యాంటీ-మిసైల్ సిస్టమ్స్, ఈ కొత్త విమానంలో లేవని, ఇది మిసైల్ దాడులను ఎదుర్కోలేదని మీడియా ఆరోపించింది.
అసలు అనుమానం ఎలా మొదలైంది?
తుర్కియేలో జరిగిన నాటో సదస్సులో పాల్గొన్న ట్రంప్, అక్కడి నుండి ఇంగ్లాండ్‌కు వెళ్లేటప్పుడు తన కొత్త విమానాన్ని పక్కన పెట్టి, హఠాత్తుగా పాత విమానాన్ని ఎక్కారు. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దెబ్బతిన్న సమయలోనే ఈ మార్పు జరగడంతో, కొత్త విమానంలో భద్రతా లోపాలు ఉన్నాయని అనుమానాలు బలపడ్డాయి.
వైట్ హౌస్ వివరణ:
ఈ వార్తలను అధ్యక్షుడు ట్రంప్ కొట్టిపారేశారు. ఇంగ్లాండ్‌లో ఉన్న అమెరికా సైనికులకు ఈ కొత్త విమానాన్ని చూపించడం కోసమే తాము పాత విమానంలో ప్రయాణించామని ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చెవుంగ్ మాట్లాడుతూ, “రాష్ట్రపతి భద్రత కోసం ప్రభుత్వం కొన్నిసార్లు వ్యూహాత్మకంగా తప్పుదోవ పట్టించే చర్యలు (misleading tactics) చేపడుతుంది
