“ట్రాఫిక్ రూల్స్‌ను మేము కరెక్ట్‌గా ఫాలో అవుతాము తెలుసా!”.. పోలీసులనే ఆశ్చర్యపరిచిన ‘డాగ్స్ గ్యాంగ్’!.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో..!!!

బెంగళూరు నగర వీధిలో ట్రాఫిక్ నిబంధనలను అత్యంత ఖచ్చితంగా పాటిస్తూ, కొన్ని వీధి కుక్కలు రోడ్డు దాటుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా మనుషులే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ వెళ్లే ఈ బిజీ ప్రపంచంలో, ఈ మూగజీవాలు ప్రదర్శించిన క్రమశిక్షణ చూసేవారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో, బిజీగా ఉన్న ఒక రోడ్డు పక్కన కుక్కల గుంపు నిలబడి ఉంది. వాహనాలు వేగంగా దూసుకెళ్తున్న ఆ రోడ్డుపై, ఒక్కసారిగా దూకకుండా.. వాహనాల వేగం తగ్గేంత వరకు ఆ కుక్కలు చాలా ఓపికగా వేచి ఉన్నాయి.

వాహనాలు ఆగగానే, పాదచారులు రోడ్డు దాటడానికి వేసిన వైట్ లైన్స్ (జీబ్రా క్రాసింగ్) పై మాత్రమే ఎంతో క్రమశిక్షణతో వరుసగా రోడ్డు దాటాయి. మనుషులు కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటే ఈ రోజుల్లో, ఈ కుక్కల ట్రాఫిక్ సెన్స్ చూసి చాలా మంది నోరెళ్లబెడుతున్నారు.

ఈ వీడియో ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్ సాధించి వైరల్‌గా దూసుకుపోతోంది. దీనిని చూసిన నెటిజన్లు పలువురు తమ ఆవేదనను, ఆశ్చర్యానీ వ్యక్తపరుస్తున్నారు.

“ఈ కుక్కలకు తెలిసిన జీబ్రా క్రాసింగ్ నియమం చాలా మంది మనుషులకు తెలియడం లేదు, వారు దానిని వాహనాలు పార్క్ చేసే స్థలంగానే చూస్తున్నారు” అని, “కుక్కలు చాలా మంది మనుషుల కంటే ఎంతో నాగరికంగా ప్రవర్తిస్తున్నాయి” అని నెటిజన్లు ఇంటర్నెట్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Posted

in

by

Tags: