మనం ఏదైనా అత్యవసరంగా బయలుదేరినప్పుడే బండి పంచర్ అవ్వడం లేదా గొడుగు మర్చిపోయిన రోజే వర్షం కురవడం లాంటివి జరుగుతుంటాయి. దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన జీవిత సూత్రాలు (Life Laws) దాగి ఉన్నాయి. మనకు తెలియకుండానే మన జీవితాన్ని నియంత్రించే ఆ ఐదు సూత్రాలు ఏమిటి? వాటిని మన ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ చూద్దాం.
1. మర్ఫీస్ లా (Murphy’s Law):
“ఏదైనా ఒక పని తప్పుగా జరగడానికి అవకాశం ఉంటే, అది ఖచ్చితంగా తప్పుగానే జరుగుతుంది” అనేది ఈ సూత్రం సారాంశం. ఉదాహరణకు, మీరు చాలా ముఖ్యమైన మీటింగ్కు వెళ్తున్నప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనిని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఏ పరిస్థితుల్లోనైనా ముందస్తు జాగ్రత్తతో ఉండటం మరియు ఎదురయ్యే అడ్డంకులను తట్టుకునే మానసిక పక్వతను అలవర్చుకోవచ్చు.
2. కిడ్లిన్స్ లా (Kidlin’s Law):
చాలామంది సమస్యకు పరిష్కారం వెతకడంలోనే సమయాన్ని వృథా చేస్తారు, కానీ అసలు సమస్య ఏమిటో స్పష్టత ఉండదు. “మీ సమస్యను ఒక కాగితంపై స్పష్టంగా రాస్తే, ఆ సమస్య సగం పరిష్కారమైనట్లే” అని కిడ్లిన్ సూత్రం చెబుతుంది. మనసులోని గందరగోళాన్ని అక్షర రూపంలో పెట్టినప్పుడు పరిష్కారం దానంతట అదే కనిపిస్తుంది.
3. గిల్బర్ట్ లా (Gilbert’s Law):
ఉద్యోగస్తులు తప్పక తెలుసుకోవాల్సిన సూత్రం ఇది. “పనిలో మీకున్న పెద్ద సమస్య ఏమిటంటే, మీరు ఏం చేయాలో ఎవరూ మీకు చెప్పరు”. అంటే, ఒక పనిని ఎలా పూర్తి చేయాలి, ఉత్తమ ఫలితాలను ఎలా సాధించాలి అనేది మీరే స్వయంగా కనుగొనాలి. పై అధికారులు వచ్చి చెప్తారని వేచి చూడకుండా, బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకునేవారే విజేతలుగా నిలుస్తారు.
4. విల్సన్ లా (Wilson’s Law):
నేటి యువత డబ్బు వెనుక పరుగులు తీస్తోంది. కానీ విల్సన్ సూత్రం ప్రకారం, “మీరు తెలివితేటలకు మరియు నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తే, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది”. డబ్బును వెంబడించకుండా, మీ నైపుణ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. మీరు ఒక రంగంలో అత్యుత్తమమని నిరూపించుకుంటే, దానికి ప్రతిఫలంగా డబ్బు దానంతట అదే చేరుతుంది.
5. ఫాక్ల్యాండ్స్ లా (Falkland’s Law):
చాలామంది చిన్న చిన్న విషయాల గురించి గంటల తరబడి ఆలోచిస్తూ బుర్ర పాడూ చేసుకుంటారు. “ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేని చోట, ఏ నిర్ణయం తీసుకోకండి” అని ఈ సూత్రం చెబుతుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా వాటిని అలాగే వదిలేయడమే కొన్నిసార్లు ఉత్తమమైన నిర్ణయం అవుతుంది.
