“డాక్టర్లు చేతులెత్తేసినా ఆశ వదులుకోలేదు..!” 5 ఏళ్లు కోమాలో ఉన్న భర్త.. ప్రాణపదంగా చూసుకున్న భార్య.. భర్త చెప్పిన ఆ ఒక్క మాట.. నెటిజన్లను కంటతడి పెట్టించిన దంపతులు..!!

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన జావో అనే వ్యక్తి, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పైకప్పుపై చిక్కుకున్న 3 ఏళ్ల చిన్నారిని కాపాడే క్రమంలో కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతను కోమాలోకి వెళ్లాడు.

అతను బతకడం కష్టమని, ఇక జీవితాంతం అతన్ని చూసుకోవడం భరించలేని భారమని డాక్టర్లు చేతులెత్తేసినప్పటికీ, అతని భార్య చాంగ్‌మెయ్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు.

భర్తపై ఉన్న నిజమైన ప్రేమ, అపారమైన నమ్మకంతో.. గత 5 ఏళ్లుగా రోజూ అతని పక్కనే ఉంటూ, అతనికి అవసరమైన మసాజ్‌లు, ఇతర సేవలను ఎంతో ప్రేమగా చేస్తూ వస్తోంది.

ఆమె నిరంతర శ్రమ, నమ్మకం ఎట్టకేలకు ఫలించాయి. కొన్ని నెలల క్రితం కళ్లు తెరిచిన జావో.. తన భార్యను చూసి ‘ఐ లవ్ యు’ అని చెప్పి అందరినీ ఉద్వేగానికి గురిచేశాడు.

ప్రస్తుతం మెల్లగా నిలబడటం, మాట్లాడటం ప్రారంభించిన జావో త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: