ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సేల్స్ డిపార్ట్మెంట్లో అభ్యర్థులను నియమించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు వివరాలు: ఫెడరల్ బ్యాంక్‌లో అసోసియేట్ ఆఫీసర్ (సేల్స్) రిక్రూట్మెంట్.
వయోపరిమితి: 23 ఏళ్ల నుండి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 4.64 లక్షల నుండి రూ. 6.70 లక్షల వరకు జీతం లభిస్తుంది. దీనితో పాటు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) కింద ప్రయోజనాలు, గ్రాట్యుటీ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తాయి.
అర్హతలు:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో కూడా కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం అదనపు అర్హతగా పరిగణించబడుతుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల వారు ఫెడరల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ‘Career/Recruitment’ పేజీలో ఆఫీసర్ రిక్రూట్మెంట్ లింక్‌ను ఎంచుకోవాలి. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివిన తర్వాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తును పూర్తి చేయాలి.

Leave a Reply