అమెరికాలో జరిగిన ఘటన: 2019లో కెవిన్ బేకన్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతను గ్రిండర్ (Grindr) అనే డేటింగ్ యాప్‌లో ఒక వ్యక్తిని కలిసేందుకు వెళ్లాడని అతని రూమ్మేట్ తెలిపాడు. పోలీసులు విచారణ చేపట్టగా, మిచిగాన్‌లో మార్క్ లదున్స్కీ అనే 50 ఏళ్ల వ్యక్తి ఇంట్లో కెవిన్ మృతదేహం అత్యంత దారుణమైన స్థితిలో కనిపించింది.
నిందితుడు కెవిన్‌ను కత్తితో పొడిచి, గొంతు కోసి, ఆపై మృతదేహాన్ని గది పైకప్పుకు తలకిందులుగా వేలాడదీశాడు. అంతకంటే భయంకరమైన విషయం ఏమిటంటే, కెవిన్ శరీరంలోని ఒక భాగాన్ని (ప్రైవేట్ పార్ట్) కోసి తిన్నానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. గతంలో కూడా లదున్స్కీని కలిసిన కొందరు వ్యక్తులు అతడి ప్రవర్తన చూసి భయపడి పారిపోయారు. 2022లో నిందితుడికి కోర్టు పరోల్ లేని జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన అధికారులను, ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
