“డ్రైవర్ సీట్లో ఎవరూ లేరు.. కానీ లోపల అస్థిపంజరం?!” టెస్లా భయానక హాలోవీన్ రైడ్. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సైబర్‌క్యాబ్ వీడియో.!

హాలోవీన్ పండుగ అంటేనే భయపెట్టే దుస్తులు, దెయ్యాల అలంకరణలు, విభిన్నమైన ఆలోచనలే మనకు ముందుగా గుర్తుకొస్తాయి.

అయితే, ఈ ఏడాది హాలోవీన్ వేడుకల కోసం ‘టెస్లా’ సంస్థ ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దీని కోసం అటానమస్ (డ్రైవర్ రహిత) ఫీచర్ ఉన్న తమ ‘సైబర్‌క్యాబ్’ రోబోటాక్సీని వినియోగించింది.

టెస్లా అధికారిక రోబోటాక్సీ ఎక్స్ (X) ఖాతాలో హాలోవీన్ థీమ్‌తో కూడిన ఒక వీడియోను షేర్ చేశారు. అందులో డ్రైవర్ లేని ఆ సైబర్‌క్యాబ్ కారు రోడ్డుపై దానంతటదే ప్రయాణిస్తోంది.

ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కారు లోపల మనుషులకు బదులుగా అస్థిపంజరాలు ప్రయాణికులుగా కూర్చుని ఉన్నాయి. ఈ భయానక హాలోవీన్ థీమ్, డ్రైవర్‌లెస్ టెక్నాలజీ కలయిక ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

సాధారణ హాలోవీన్ ప్రకటనల్లా కాకుండా, హాస్యం, విజువల్స్ ఉపయోగించి టెస్లా ఈ వీడియోను రూపొందించింది. కారు సీట్లలో అస్థిపంజరాలు కూర్చుని ప్రయాణిస్తున్నట్లు చూపించడం.. డ్రైవర్‌లెస్ ప్రయాణ భవిష్యత్తును ప్రజలకు సరదాగా, విభిన్నంగా పరిచయం చేయడానికి టెస్లాకు ఒక మంచి అవకాశంగా మారింది.

సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు టెస్లా ఆలోచనను ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ‘టెస్లా హ్యూమర్‌కు ఎవరూ సాటిరారు’, ‘టెస్లా మాత్రమే ఇలా ఆలోచించగలదు’ అని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ వినూత్న ఆలోచనతో పండుగ సీజన్‌లో టెస్లా తమ డ్రైవర్‌లెస్ కార్ టెక్నాలజీని విజయవంతంగా ప్రమోట్ చేసుకుంది.


Posted

in

by

Tags: