చేపలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారం. ఇందులో విటమిన్ ఏ, డి, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేయడానికి తోడ్పడతాయి. అయితే, చేపలతో పాటు పెరుగు లేదా పాలు తీసుకోవడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.
ఎందుకు వద్దు అంటారు?
- జీర్ణక్రియ సమస్యలు: చేపలు మరియు పెరుగు రెండు కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే భారీ ఆహారాలు. వీటిని కలిపి తీసుకున్నప్పుడు జీర్ణక్రియ మందగించి, కొంతమందిలో కడుపు ఉబ్బరం, అసిడిటీ లేదా గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.
- ఆయుర్వేద కోణం: ఆయుర్వేద వైద్య విధానంలో చేపలు, పెరుగులను ‘విరుద్ధాహారం’ (Pror incompatible foods) అని అంటారు. ఇవి శరీరంలో విషతుల్యాలను (toxins) పెంచి, దీర్ఘకాలంలో చర్మ సమస్యలు లేదా ఎలర్జీలకు దారితీయవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
- జీవనశైలి: మంచి జీర్ణశక్తి ఉండి, నిత్యం వ్యాయామం చేసేవారిపై ఈ ఆహార కలయిక పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని దూరంగా ఉంచడమే మేలు.
చేప తల: పోషకాల గని
చాలామంది చేపలు తినేటప్పుడు తల భాగాన్ని పక్కన పెడుతుంటారు. కానీ నిజానికి చేప తలలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి:
- కిడ్నీలో రాళ్లు: చేప తలలోని పోషకాలు కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
