బెంగళూరు మెజెస్టిక్ రైల్వే పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న శిల్ప అనే గర్భిణి అయిన మహిళా కానిస్టేబుల్‌పై ఒక యువకుడు ఇనుప రాడ్‌తో పాశవికంగా దాడి చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
గత ఆగస్టు 26వ తేదీ తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో, గజేంద్ర అనే యువకుడు తన సెల్‌ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఇతర పోలీసులెవరూ లేకపోవడంతో, ఉదయం ఉన్నతాధికారులు విధుల్లోకి వచ్చాక ఫిర్యాదు చేయాలని శిల్ప అతనికి చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గజేంద్ర బయటకు వెళ్లి, కొద్దిసేపటికే చేతిలో ఇనుప రాడ్‌తో తిరిగి పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డాడు.
కనురెప్ప మూసి తెరిచేలోపే అతను శిల్ప తలపై ఇనుప రాడ్‌తో 7 నుంచి 8 సార్లు విచక్షణారహితంగా బలంగా బాదడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. శిల్ప ఆర్తనాదాలు విని పరుగున వచ్చిన తోటి పోలీసులు, వెంటనే ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ తీవ్ర చికిత్స పొందుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఒక గర్భిణి అయిన మహిళా కానిస్టేబుల్‌పై జరిగిన ఈ తెగించిన దాడిపై బెంగళూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు గజేంద్రను అరెస్ట్ చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply