తల్లా లేక దయ్యమా..? రెండేళ్ల బిడ్డకు ప్రేమగా బిస్కెట్ తినిపించి ప్రాణాలు తీసేసిందా..? ఇందులో కూడా విషం పెడతారా! గర్భవతని తెలియగానే ఆసుపత్రికి తరలింపు.. కన్నకొడుకును చంపేసి పరారైన తల్లితో తీవ్ర కలకలం!

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో, రెండున్నరేళ్ల కన్నకొడుకుకు విషమిచ్చి హత్య చేసిన కేసులో అరెస్టయిన ఓ మహిళ.. పోలీసుల నిఘాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడి నుంచి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆర్తీ కుమారి అనే ఆ మహిళ, తన కుమారుడు ఆర్యన్ కుమార్‌కు బిస్కెట్లలో విషం కలిపి తినిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఆగస్టు 20న ఈ దారుణం జరిగినట్లు సమాచారం. చిన్నారి ఆరోగ్యం విషమించి మృతి చెందడంతో పోలీసులు ఆర్తిని అరెస్ట్ చేశారు. అయితే, పోలీసు కస్టడీలో ఉండగానే ఆమె తప్పించుకోవడంతో భద్రతా ఏర్పాట్లపై తీవ్ర ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అరెస్టయిన సమయంలో ఆర్తి దాదాపు రెండు నెలల గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెను స్థానిక మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని మాతా-శిశు సంరక్షణ వార్డులో చేర్పించారు. అక్కడ ఆమె పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఆమెపై నిఘా ఉంచేందుకు మహిళా కానిస్టేబుళ్లను కూడా భద్రతగా నియమించారు. అయినప్పటికీ బుధవారం తెల్లవారుజామున పోలీసుల కళ్లుగప్పి ఆర్తి ఆసుపత్రి నుంచి తప్పించుకుపోయింది. దీంతో అటు ఆసుపత్రి వర్గాల్లో, ఇటు పోలీస్ శాఖలో తీవ్ర గందరగోళం నెలకొంది.

నిందితురాలు పరారైన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆమె ఏ మార్గంలో తప్పించుకుందో గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పారిపోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వ్యక్తులను సంప్రదించిందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

పోలీస్ కస్టడీలో ఉన్న ముద్దాయి తప్పించుకుపోవడం పోలీసుల భద్రతా వైఫల్యంపై విమర్శలకు దారితీసింది. రెండున్నరేళ్ల చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంత సులభంగా ఎలా పారిపోగలిగిందనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కాగా, ఆర్తికి తన భర్తతో తరచూ గొడవలు జరిగేవని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె భర్త పంజాబ్‌లో రోజువారీ కూలీగా పనిచేస్తుండగా, ఫోన్లలో ఇద్దరి మధ్య నిత్యం ఘర్షణలు జరిగేవని వెల్లడైంది. ప్రస్తుతం చిన్నారి హత్య కేసు దర్యాప్తుతో పాటు, కస్టడీ నుంచి పరారైన నిందితురాలిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *