సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే వాటర్ బాటిళ్ల లోపల దాగి ఉండే మురికిని గమనించరు.
ఇవి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. మనం ఎప్పుడూ పైపైన శుభ్రం చేయడం వలన శుభ్రంగా ఉందని అనుకుంటాము. కానీ ఒక తండ్రి తన కూతురి వాటర్ బాటిళ్లను కడిగిన తర్వాత కూడా పూర్తిగా శుభ్రంగా కనిపించడం లేదని గమనించారు.
అతను వాటర్ బాటిల్ మూతలను వేడి చేసినప్పుడు (Boil చేసినప్పుడు), బాటిల్ మూతలోని సీల్స్ (Gaskets) వదులై, వాటి నుండి నలుపు రంగులో మురికి పేరుకుపోయినట్లు తేలింది. చాలా పిల్లల బాటిళ్లు ఈ విధంగా విడదీయడానికి రూపొందించబడవు. కొన్ని బాటిళ్లలో ఇలా ఉంటుంది. దీనిని సరిగ్గా శుభ్రం చేసి పిల్లలకు ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు. అంటే, ప్రతిరోజూ తమ పిల్లలు తాగే నీటి బాటిళ్లలో దాగి ఉన్న సీల్స్ లోపల ఏమి ఉందో వేల కుటుంబాలకు తెలియదు. బయటి నుంచి చూస్తే, అంతా పూర్తిగా సాధారణంగా కనిపిస్తుందని ఆయన అన్నారు.
