బెంగళూరులో ఒక తల్లి తన 23 ఏళ్ల కుమార్తె మరియు ఆమె భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
చదువు కోసమని తల్లిదండ్రుల వద్ద మొబైల్ ఫోన్ తీసుకున్న కూతురు, తన తల్లి మరియు ఒక బంధువుకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను వారికి తెలియకుండానే రహస్యంగా తీసింది. ఆ తర్వాత ఆ ఫోటోలను తన ప్రియుడికి పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇటీవల ఆ యువతికి, ఫోటోలు అందుకున్న సదరు వ్యక్తికి వివాహం జరిగింది. అయితే, యాదృచ్ఛికంగా కూతురి ఫోన్ తనిఖీ చేసిన తల్లికి అందులో ఉన్న ఫోటోలను చూసి గుండె ఆగినంత పనైంది. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, ఆ యువతి మరియు ఆమె భర్త సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
