“తల్లులారా జాగ్రత్త!” తెలియక మింగేసిన సేఫ్టీ పిన్.. 7 నెలల చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చిన ప్రమాదం.. డాక్టర్లు చేసిన ఆ ‘మ్యాజిక్’..!!

మహారాష్ట్రలోని దాపోలి ప్రాంతంలో, 7 నెలల పసికందుకి జలుబు, దగ్గు ఉందని భావించి నెల రోజులుగా చికిత్స అందిస్తున్న తల్లిదండ్రులకు ఒక షాకింగ్ నిజం తెలిసింది.

మందులు వాడినా తగ్గకపోవడంతో తీయించిన ఎక్స్-రే (X-ray) పరీక్షలో, ఆ చిన్నారి గొంతులో ఒక సేఫ్టీ పిన్ (Safety Pin) తెరుచుకుని చిక్కుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. నెల రోజులుగా ఆ చిన్నారి ఆ నొప్పితో విలవిలలాడుతోందని తెలిసిన వెంటనే, తల్లిదండ్రులు ఆసుపత్రికి పరుగులు తీశారు.

అక్కడి వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి, ఆహారవాహిని వరకు వెళ్ళిన ఆ పిన్‌ను చాలా చాకచక్యంగా బయటకు తీశారు. ఒకవేళ ఆ పిన్ ఆహారవాహినిని గనుక చీల్చి ఉంటే, చిన్నారి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని వైద్యులు హెచ్చరించారు. “చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో సూదులు, నాణేలు, చిన్న చిన్న ఆటవస్తువులు వంటి వాటిని పిల్లలకు అందనంత దూరంలో ఉంచాలి” అని ఈ ఘటన ద్వారా వైద్యులు తల్లిదండ్రులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.


Posted

in

by

Tags: