ర్యాపిడో (Rapido) బైక్ టాక్సీ సేవను వినియోగించుకున్న ఒక యువతి, తన ప్రయాణంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది.
ఆఫీసు పని ముగించుకుని తన హాస్టల్కు వెళ్తున్న సమయంలో, బైక్ డ్రైవర్ తన పట్ల నిరంతరం అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. మొదట్లో అది పొరపాటున తగిలినట్లు అనిపించినా, తర్వాత అది కావాలని చేస్తున్న పని అని తాను గ్రహించానని ఆమె తెలిపింది. ఆ సమయంలో భయం మరియు షాక్ కారణంగా తాను వెంటనే స్పందించలేకపోయానని ఆమె ఆవేదనగా పేర్కొంది.
ప్రయాణ సమయంలో ఆ డ్రైవర్ వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతూ భయపెట్టడమే కాకుండా, సదరు మహిళ అడ్డుకున్నా తన చేష్టలను ఆపలేదని తెలిసింది. భద్రత దృష్ట్యా ఆ మహిళ ఈ ఘటనను తన మొబైల్లో రికార్డ్ చేసింది.
మహిళలతో బైక్ రైడర్ అనుచిత ప్రవర్తన.. వీడియో వైరల్ ర్యాపిడో రైడర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అస్సాంకు చెందిన ఓ మహిళ ఇన్స్టాలో వీడియో షేర్ చేసింది. ప్రయాణ సమయంలో అతడు వీపు గోకుతున్నట్లు నటిస్తూ చేతితో పదేపదే అనుచితంగా తాకాడని, వ్యక్తిగత ప్రశ్నలతో వేధించాడని ఆరోపించింది.
మొబైల్ యాప్ల ద్వారా బైక్ టాక్సీలను ఉపయోగించే మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించింది. ఈ ఘటనపై ర్యాపిడో సంస్థ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
