ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం కొత్త శిక్షాస్మృతిని (Criminal Code) అమలులోకి తెచ్చింది. ఇది మానవ హక్కుల సంఘాలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదించిన ఈ 90 పేజీల చట్టం, మహిళలను బానిసలతో సమానంగా పరిగణిస్తోంది.
ఈ చట్టంలోని ప్రధాన నిబంధనలు:
- శారీరక హింసకు అనుమతి: భార్యలు ఏదైనా తప్పు చేసినట్లు భావిస్తే భర్తలు వారిని కొట్టవచ్చు. అయితే, ఆ దెబ్బల వల్ల ఎముకలు విరగకూడదని లేదా చర్మం తెగకూడదని (No fracture or cut on skin) వింత నిబంధనను విధించింది.
- కఠిన ఆంక్షలు: భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్లే మహిళలకు మూడు నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
- మత పెద్దలకు మినహాయింపు: ఉన్నత స్థాయి మత పెద్దలకు నేరాల నుండి రక్షణ కల్పిస్తూ, సామాన్య ప్రజలపై మాత్రం కఠినమైన శిక్షలు విధిస్తోంది.
- న్యాయం దక్కడం కష్టం: ఒకవేళ మహిళ తన భర్త తనపై తీవ్రంగా దాడి చేశాడని నిరూపించాలన్నా, ఆమె తన గాయాలను న్యాయమూర్తికి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ దాడి జరిగినట్లు నిరూపితమైనా, భర్తకు కేవలం గరిష్టంగా 15 రోజులు మాత్రమే శిక్ష పడుతుంది.
