ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ మరియు టీమ్ ఇండియాకు మద్దతుగా నిలిచిన వారిలో సింగర్, సోషల్ మీడియా పర్సనాలిటీ జనాయ్ భోంస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సిరాజ్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. తద్వారా అమెరికాపై భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ ప్రదర్శనను మెచ్చుకుంటూ జనాయ్ తన ఇన్స్టాగ్రామ్ రీల్లో “Back to rule. So proud of everything” (తిరిగి ఏలడానికి వచ్చాడు. నీ గురించి గర్వంగా ఉంది) అని క్యాప్షన్ ఇచ్చారు.
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మనవరాలైన జనాయ్, గతంలో సిరాజ్‌తో ఉన్న స్నేహం కారణంగా వార్తల్లో నిలిచారు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని అప్పట్లో రూమర్స్ రాగా, జనాయ్ సిరాజ్‌కు రాఖీ కట్టి ఆ పుకార్లకు చెక్ పెట్టారు. తామిద్దరం అన్నాచెల్లెళ్ల లాంటి వాళ్లమని వారు అప్పట్లోనే స్పష్టం చేశారు.
‘ఇదంతా నాటకం’: జస్ప్రీత్ బుమ్రాపై నెటిజన్ల ప్రశ్నలు మరోవైపు, అమెరికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బుమ్రా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడని, అందుకే విశ్రాంతి ఇచ్చామని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుమ్రా మైదానంలో డ్రింక్స్ బాటిల్స్ మోస్తూ కనిపించడంతో నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. “నిజంగా జ్వరం ఉంటే డ్రింక్స్ బాటిల్స్ ఎలా మోస్తాడు? ఇదంతా కేవలం విశ్రాంతి ఇవ్వడానికి ఆడుతున్న నాటకం” అంటూ కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ముఖ్యమైన బౌలర్‌కు విశ్రాంతి ఇవ్వడం మంచి నిర్ణయమేనని మద్దతు తెలుపుతున్నారు.
